గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్. ఆర్. పురం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 13నుండి 15 వరకు తుఫాన్ ముప్పు పొంచి ఉన్నందున తుఫాను సమయంలో ఇళ్లలోనే ఉండాలని, వాగులు వంకలు దాటడానికి ప్రయత్నించకూడదని తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని అన్నారు.