ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

63చూసినవారు
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం గలీబిపల్లి గ్రామ పరిధిలోని ఉపాధి హామీ కూలీలకు రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధులచే సోమవారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఆర్థిక వ్యవహారాల పట్ల అవగాహన కల్పించి వారు ఆర్థికంగా స్థిరపడేలా పలు సూచనలు సలహాలను ఇచ్చారన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్