తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్‌వీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. గుంపు మేస్త్రీ అంటే కట్టేతోడు.. కానీ ఇతను కూల్చేటోడు అని ఎద్దేవా చేశారు. పోరాటమనేది బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఏమీ కదన్నారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదని ఫైర్ అయ్యారు.