మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. సమర్ బిల్లోర్ (13) అనే బాలుడు స్థానికంగా జరిగిన ఓ పండుగ వేడుకల్లో డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బాలుడిని చూసిన జమునాదేవి తల్లి సహాయం కోసం కేకలు వేయడంతో స్థానికులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. బాలుడి మృతిలో కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.