సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ మరోసారి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందింది. టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 10 కాఫీల జాబితాలో.. ఫిల్టర్ కాఫీ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది దక్షిణ భారతదేశంలో ప్రత్యేకమైన రుచి, ప్రత్యేకమైన తయారీ విధానానికి ప్రసిద్ధి చెందింది. ఈ జాబితాలో మొదటి స్థానం క్యూబా ఎస్‌ప్రెస్సోకి దక్కడం గమనార్హం.