Oct 21, 2024, 03:10 IST/
తెలంగాణకు మళ్లీ వర్ష సూచన
Oct 21, 2024, 03:10 IST
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లో సాయంత్రం తర్వాత వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.