కుప్పం మున్సిపాలిటీలో రోడ్లపై చెత్త నిల్వలు వేయరాదని కమిషనర్ శ్రీనివాసరావు గురువారం స్పష్టం చేశారు. క్లీన్ కుప్పంగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. డ్రోన్ల ద్వారా రోడ్లపై చెత్త వేస్తున్నవారిని గుర్తించి అవగాహన కల్పిస్తామని ఆయన తెలియచేశారు. ప్రజలందరూ మునిసిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.