
కుప్పం: టెక్నాలజీని విధ్వంసానికి వాడకండి: భువనేశ్వరి
ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని వ్యక్తిత్వ వికాసానికి వాడుకోవాలే గానీ విధ్వంసానికి కాదని నారా భువనేశ్వరి బుధవారం పేర్కొన్నారు. కుప్పంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ను నారా భువనేశ్వరి సందర్శించి విద్యార్థులనుద్దేశించి ఆమె మాట్లాడారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీని వాడుకోవడం తెలియక కొంతమంది యువత దుర్వినియోగం చేస్తోందని, ఇది వారి భవిష్యత్తును కాలరాస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.