మదనపల్లె పట్టణంలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. నక్కలదిన్నెలో ఉండే నగీన (22) మదనపల్లె రీడింగ్ రూమ్ వీధిలో ఓ బట్టల షాపులో పనిచేస్తోంది. తనతో పాటు పని చేస్తున్న అబ్దుల్ రజాక్ ను ప్రేమించింది. రజాక్ మేనమామ తమను విడదీసి పది మందిలో పరువు తీస్తున్నాడని ఆమె వాపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె బుధవారం విషం తాగడంతో కుటుంబసభ్యులు ఆమెకి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతి చెందింది.