

మదనపల్లి: ఫ్రీజర్ బాక్స్ లేకపోవడం నాకే అవమానం: ఎమ్మెల్యే
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆసుపత్రిలో చనిపోయిన మృతదేహాలను కొద్దిసేపు ఉంచుకోవడానికి ఫ్రీజర్ బాక్స్ లేకపోవడం తనకెంతో అవమానకరమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రాయచోటి యువకుడి మృతదేహాన్ని మార్చురీలో ఉంచేందుకు రూ. 3వేలు అడిగారని తెలిసిందని ఎమ్మెల్యే అన్నారు. దాతల సాయంతో మదనపల్లి ఆసుపత్రికి నాలుగు ఫ్రీజర్ బాక్సులను సమకూర్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.