ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆదివారం నగిరి నియోజకవర్గం , నిండ్ర మండలంలో నిర్వహిస్తున్న మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులలో పూర్తిచేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు తెలిపారు.