నగరి నియోజకవర్గం నిండ్ర గ్రామంలో ఉన్న శ్రీ ప్రసన్న వినాయక స్వామి ఆలయం వద్ద భోగి పండుగ పర్వదినం సందర్భంగా ప్రతి ఏటా సాంప్రదాయ కోలాట నృత్య భజనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఆలయం వద్ద వెంగళత్తూరు శ్రీ వేణుగోపాలస్వామి కోలాట బృందం వారిచే కోలాట భజనలు వైభవంగా జరిపారు. ఇలాంటి సాంప్రదాయ కోలాట భజనలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.