పాకాలలో ఆకస్మాత్తుగా వర్షం
పాకాలలో శనివారం ఆకస్మాత్తుగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉండగా.. మధ్యాహ్నం ఆకస్మాత్తుగా వర్షం కురిసింది. వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాబోవు మూడు రోజుల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమతంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.