చిత్తూరు జిల్లా గంగవరంలో గురువారం అధికారులు పట్టు రైతుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టు రైతులకు పట్టు సాగులో మెళకువలు, పట్టు పురుగులకు సోకే వ్యాధులు, నివారణ, మల్బరీ సాగులో పాటించాల్సిన మెలకువలను వివరించారు. ఏ రకం పట్టు గూళ్లకు ధరలు ఎక్కువ ఉన్నాయి, వాటిని ఎక్కడ ఎలా విక్రయించాలో రైతులకు అధికారులు వివరించారు.