Nov 06, 2024, 05:11 IST/
విషాదం.. డబ్బులు కడితేనే డెడ్ బాడీ ఇస్తామంటున్న ఆస్పత్రి సిబ్బంది (వీడియో)
Nov 06, 2024, 05:11 IST
TG: హైదరాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రికి అనారోగ్యంతో వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. అయితే నాగప్రియ వైద్యం కోసం ఇప్పటికే రూ. 3 లక్షలకు పైగా చెల్లించామని, మృతదేహాన్ని అప్పగించాలంటే ఇంకా రూ. 4 లక్షలు ఇవ్వాలని ఆస్పత్రి సిబ్బంది డిమాండ్ చేసినట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.