Nov 27, 2024, 03:11 IST/రామగుండం
రామగుండం
మంథని: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
Nov 27, 2024, 03:11 IST
మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు మంగళవారం ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఖానాపూర్ పిడబ్ల్యుడి రోడ్డు నుండి లక్ష్మీ మడుగు వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సీనియర్ నాయకులు తొట్ల తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.