వైసీపీ పిలుపు మేరకు ఈ నెల 27న విద్యుత్ చార్జీల పెంపునకు నిరసన తెలుపనున్నట్లు పీలేరు మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు మాట తప్పి ప్రస్తుతం కరెంట్ చార్జీలు పెంచుతున్నారని ఆరోపించారు. చార్జీలు పెంపునకు నిరసనగా పీలేరు విద్యుత్ కార్యాలయం ముందు 27న.. నిరసనను కార్యకర్తలు జయప్రదం27న నిరసన చేయాలని కార్యకర్తలను కోరారు.