ఎస్సీ వర్గీకరణ వద్దంటూ జై భీమ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ, అందరూ కలిసికట్టుగా ఉంటామని, వర్గీకరణ పేరుతో విడదీయ వద్దని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.