చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి గో సంరక్షణకు రూ. లక్ష విరాళం అందింది. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డికి చెందిన ప్రసాద్ ఈ నగదును ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణికి శుక్రవారం అందజేశారు. ఆలయ అధికారులు దాతకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. కార్య క్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి పాల్గొన్నారు.