విద్యుత్ వినియోగదారులు ప్రతీ ఒక్కరు కేంద్ర ప్రభుత్వం రాయితీతో అందించే సూర్యగర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు సురేంద్ర నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పుత్తూరు పట్టణంలో విద్యుత్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యుత్ వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లు చెల్లించాలని, ప్రతీ ఒక్కరికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు.