Mar 10, 2025, 17:03 IST/మంథని
మంథని
పెద్దపల్లి: ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
Mar 10, 2025, 17:03 IST
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుండి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి సమస్యను పరిష్కరించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.