అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఈ రుణాలను ఏపీ అప్పుల పరిమితిలోకి లెక్కించకూడదని నిర్ణయించినట్లు పార్లమెంటుకు చెప్పింది. లోక్‌సభలో వైసీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పూర్తి వివరాలతో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.