ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో దారుణ ఘటన వెలుగు చూసింది. శ్రీరామ్ నగర్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఓ జంట సంతోషంగా పెళ్లి చేసుకుంది. అయితే వారికి పెద్దలు శోభనం ఏర్పాటు చేసి గదిలోకి పంపించారు. అయితే తెల్లారి లేచి చూసేసరికి ఇద్దరు శవాలుగా కనిపించారు. వధువు మంచంపై పడిపోయి ఉండగా.. వరుడు ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. వధువును చంపి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.