యూపీలో మొరాదాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. పిల్లి ఎదురొచ్చిందని పలువురు మహిళలు దానిని చంపేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా పిల్లి ఎదురువచ్చింది. దీంతో వారు దానిని చంపేసి సజీవ దహనం చేశారు. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని రికార్డ్ చేశారు. ఆ వీడియో క్లిప్ తాజాగా బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.