జీవితంలో ప్రతి ఒక్కరికీ కొన్ని అవకాశాలు వస్తాయని.. మలుపు తిరిగే అవకాశాలు అందిపుచ్చుకున్నవారే ఎదుగుతారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన మ్యాన్‌హ్యాటన్ గ్రంథావిష్కరణ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. "ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పని చేశారు. ఆయన నైపుణ్యం చూసి ఇంటర్వ్యూ లేకుండా నియమించారు. నోరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనను అనేక అవార్డులు వరించాయి." అని అన్నారు.