

ఉగాది పురస్కారాన్ని అందుకున్న పుంగనూరు అర్చకులు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు బాలసుబ్రమణ్యం ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తరపున చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు ఉగాది పురస్కారాన్ని బాలసుబ్రమణ్యంకు అందజేశారు.