ఎస్డిపిఐ ని ఆశీర్వదించండి
రానున్న ఎన్నికలలో ఎస్డిపిఐ ని ఆశీర్వదించాలని పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్వర్ భాష కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం నియోజకవర్గానికి చెందిన రొంపిచర్ల మండలంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికలలో ప్రజలు సిలిండర్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్వర్ భాష కోరారు.