శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు కూడా తినే రోజులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. 'ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడం సంతోషకంగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరగవడంతో రాష్ట్ర ప్రజలు సన్న బియ్యానికి మొగ్గు చూపుతున్నారు. అందుకే ప్రజల ఆకాంక్ష మేరకు సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టాం’అని తెలిపారు.