పుంగనూరు: భార్యాభర్తలు ఉరేసుకుని ఆత్మహత్య
పుంగనూరు మండల పరిధిలోని మేళం దొడ్డి గ్రామానికి చెందిన శ్రీనివాసులు( 45), నీలమ్మ (40) ఆదివారం రాత్రి గ్రామ సమీపంలో బైరా బండకు వెళ్లే మార్గంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు బెంగళూరులో టైలర్లగా పనిచేస్తూ ఇటీవల గ్రామానికి వచ్చిన దంపతులు కిడ్నీలు పాడుకోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.