పుంగనూరు మండల పరిధిలోని కంగా నెల్లూరు గ్రామానికి చెందిన వాసుల కుమారుడు నాగరాజా (34)దర్జీగా జీవనం సాగిస్తున్నాడు. రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక గురువారం ఉదయం గ్రామ సమీపంలో కత్తితో పొట్టలో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు నాగరాజా ను హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వాసుపత్రి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.