పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని పెద్ద ఉప్పరపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న దుర్గం కొండ అభివృద్ధి పనులకు అనుమతులు లేవని, ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధి పనులను వెంటనే నిలిపివేయాలని పుంగనూరు అటవీ శాఖ రేంజర్ శ్రీరాములు బుధవారం తెలిపారు. దీనితో ఈ విషయం తెలుసుకున్న పలువురు గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని అధికారులను నిలదీశారు. పూర్తి వివరాలు అటవీశాఖ అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది.