Dec 02, 2024, 03:12 IST/
వాయుగుండంగా బలహీనపడిన ఫెంగల్ తుఫాన్
Dec 02, 2024, 03:12 IST
ఫెంగల్ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఈ నేపథ్యంలో రాయలసీమ, కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశముంది. తెలంగాణ, కేరళలోనూ అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు. తమిళనాడులో 3 జిల్లాలకు రెడ్ అలెర్ట్, మరో 5 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. పుదుచ్చేరిలో పలు కాలనీలు ఇంకా నీటిలోనే మునిగిపోయాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.