TG: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరోసారి మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అదే సమయంలో ఆదర్శనగర్ క్వార్టర్స్ నుంచి అటువైపు వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు గాయలైన వారిని గమనించి కాన్వాయ్‌ను ఆపారు. పది నిమిషాల వరకు అక్కడే ఉండి సహాయక చర్యలు అందించారు.