ఏడు గ్రామాలకు రాకపోకలు బంద్
చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి పరిసర ప్రాంతాలలో గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా గార్గేయ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని మూడు చోట్ల తాత్కాలిక రాకపోకలు సాగించే కల్వట్లు వర్షం ధాటికి కొట్టుకుపోవడంతో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే తాత్కాలిక రోడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని ఏడు గ్రామాలకు చెందిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.