సోమలని ఆదర్శ మండలంగా తీర్చి దిద్దండి

2952చూసినవారు
సోమల మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చీ దిద్దడానికి ప్రతి ఒకరు కృషి చేయాలని పుంగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి యువనేత, మండల ఇన్చార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు‌. ఆదివారం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై వారిని సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి కుటుంబంపై నమ్మకంతో మండల ప్రజలు సర్పంచ్ మరియు వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆ నమ్మకాన్ని ప్రతి సర్పంచ్, వార్డు సభ్యులు నిలబెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి చేరే విధంగా కృషి చేస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలని నూతన సర్పంచ్ లకు సూచించారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన 15 పంచాయతీల సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సోమల మండల పార్టీ అధ్యక్షుడు గంగాధరం, సోమల సింగిల్ విండో చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎంపిపి ఈశ్వరయ్య,జెట్పిటిసి అమాస కుసుమ కుమారీ, సోమల మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణమ్మ, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్లు అమాస మోహన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్