మండలంలోని రైతులను ఆదుకోండి
ఏనుగుల దాడులలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మంగళవారం చిత్తూరు డిఎఫ్ఓ చైతన్యకుమార్ కు టిడిపి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఇరికిపెంట మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ.. తరచూ ఏనుగులు మండలంలో సంచరిస్తూ రైతులు పండిస్తున్న పంటలను ఇష్టానుసారం తోకి ధ్వంసం చేస్తున్నాయన్న విషయాన్ని వినతి పత్రంలో పొందుపరిచామని తెలిపారు.