18న సచివాలయాల వద్ద ధర్నా: సీపీఐ

56చూసినవారు
ప్రజా సమస్యల పోరాటాలపై శుక్రవారం శ్రీకాళహస్తిలోని సీపీఐ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి మురళీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో గృహాలు లేని పేదవారికి పట్టణంలో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 18వ తేదీన సచివాలయాల వద్ద ధర్నా చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్