భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్ పాఠశాలలు, కళాశాలలకు కలెక్టర్ సెలవు ఇచ్చారు. ఇవేమీ పట్టించుకోకుండా శ్రీకాళహస్తి పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహించాయి. ఈ విషయమై ఎంఈవో బాలయ్య ను వివరణ కోరగా. పాఠశాల యజమానికి ఫోన్ చేశామని పాఠశాలలకు సెలవు ప్రకటించారని చెప్పారు.