శ్రీకల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

85చూసినవారు
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు గురువారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయంలో జరిగిన అంకురార్పణం సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. పుణ్యాహ వచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం వైఖానస ఆగమోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్