భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా సోమవారం అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నాయుడుపేటలోని లోతట్టు ప్రాంతాల వాసులను ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు వరదల్లో చిక్కుకుంటే హెల్ప్ లైన్ నెంబర్ 08623 248084, 63048 55003 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.