విరబూసిన బ్రహ్మకమలాలు

68చూసినవారు
తంబళ్లపల్లె వెంకటేశ్వర వీధికి చెందిన శైలజ ఇంటి పెరట్లో శుక్రవారం అరుదైన బ్రహ్మ కమలాలు ఒకేసారి 18 విరబూసి కనువిందు చేస్తున్నాయి. ఏడాదిలో ఆగస్టు, సెప్టెంబర్ లో మాత్రమే వికసించే ఈ పువ్వులు జూన్ లో వికసించి ఆశ్చర్య పరుస్తున్నాయి. బ్రహ్మ కమలంపై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడని హిందువులు నమ్ముతారు. పవిత్రమైన పువ్వులు ఇంటి పెరట్లో విరబూయడంతో కుటుంబ సభ్యులు పూజలు చేశారు. చుట్టుపక్కల వారు సెల్ఫీలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్