
తంబళ్లపల్లెలో ఉపాధి హామీ ఇంజనీర్ గా మహేష్ బాబు
తంబళ్లపల్లి మండలం ఉపాధి హామీ పథకం ఇంజనీరుగా మహేష్ బాబు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఉపాధి హామీ పథకం ఇంజనీర్ గా పనిచేస్తున్న రామన్న గాలివీడుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పిటీఎం మండలంలో ఉపాధి హామీ పథకం ఇంజనీరుగా పనిచేస్తూ ఉండిన మహేష్ బాబు బదిలీపై తంబళ్ళపల్లి కి వచ్చారు. ఉపాధి హామీ పనుల నిర్వహణలో మెరుగైన సేవలు అందించడంతోపాటు ఉపాధి కూలీల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తానని అన్నారు.