తంబళ్లపల్లెలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం

70చూసినవారు
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం అధికారులు లైవ్ టెలికాస్ట్ ద్వారా తంబళ్లపల్లెలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఎంపీడీఓ కృష్ణమూర్తి, ఎంఆర్ఓ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో గల ఉప ఖజానా కార్యాలయంలో పెద్ద స్క్రీన్ ఏర్పాటుచేసి సీఎం ప్రమాణ స్వీకారాన్ని ప్రదర్శించారు. అధిక సంఖ్యలో ప్రజలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు.

సంబంధిత పోస్ట్