
తిరుపతి: టీటీడీలో ఉద్యోగి చేతివాటం..ఇంటి దొంగలపై టీటీడీ కొరడా...
టీటీడీలో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులు పక్కదారి పట్టిస్తున్నారు. చెన్నైలో టీటీడీ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. ఏకంగా శ్రీవారి హుండీలోనే దొంగతనానికి సదరు ఉద్యోగి పాల్పడ్డాడు. హుండీ కానుకల్లో టీటీడీ సీనియర్ ఉద్యోగి కృష్ణకుమార్ చేతివాటం చూపించాడు. విదేశీ కరెన్సీ లెక్కపెడుతుండగా భారీగా అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. సోమవారం టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు కృష్ణకుమార్పై సస్పెన్షన్ వేటు వేశారు.