

తిరుమల శ్రీవారి సేవలో మాజీ ఇండియన్ క్రికెటర్ నిఖిల్ చోప్రా
మాజీ భారతీయ క్రికెటర్ నిఖిల్ చోప్రా కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం నైవేద్య విరామ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా వైకుంఠం వద్ద ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.