
తిరుపతి: విద్యార్థిని 2వ అంతస్తు నుంచి తోసేసిన మరో విద్యార్థిని
తిరుపతిలోని చైతన్య టెక్నో స్కూల్లో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. భైరాగిపట్టెడలో ఉన్న చైతన్య టెక్నో స్కూల్ లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్నేహ, మరో విద్యార్థికి కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. విద్యార్థినిపై విద్యార్థి ఈర్ష్య పెంచుకుని శనివారం 2వ అంతస్తు నుంచి స్నేహను కిందకు తోసేశాడు.