ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కు ధన్యవాదాలు

426చూసినవారు
ఆనందం వ్యక్తం చేసిన పలువురు ఉపాధ్యాయులు

తిరుపతి ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రములో సైన్స్, మ్యాథమేటిక్స్,ఆర్ట్స్ విభాగము నందు జిల్లా వ్యాప్తంగా శాస్త్రీయ వేత్తలకు చిరు పురస్కారం పేరుతో 25 మంది మహిళలకు సైన్స్ లో చేసిన సేవకు గుర్తింపుగా పురస్కారం అందచేసి వారిని సన్మానించారు.అందులో పీలేరు మండలం నుండి మేల్లచెరువు జడ్.పి ఉన్నత పాఠశాలకు చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయిని బీ.కుసుమాంబ,పీలేరు జడ్.పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయిని జానం సుజాత ఉన్నారు.వీరు తమకు పురస్కారాలు అందచేసిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ తిరుపతి వారికి,జిల్లా సైన్స్ కో ఆర్డినేటర్ పి.నీలకంఠయ్య కు కృతజ్ఞతలు తెలిపారు.మేల్లచేరువు జడ్.పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టీ.గంగాధర్,పీలేరు జడ్.పి బాలికోన్నత పాఠశాల ప్రదానోపాధ్యాయిని ఎన్.జయమ్మ తమ పాఠశాల ఉపాధ్యాయినులకు పురస్కారాలు లభించడంపట్ల ఆనందం వ్యక్తం చేసి వారిని అభినందించారు.

ట్యాగ్స్ :