గేట్ ను వీధి వ్యాపారులకు మినహాయించాలి

82చూసినవారు
ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం వారు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ ను సోమవారం కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ 'గేట్'ను వీధి వ్యాపారులకు మినహాయించి టెండర్ ప్రక్రియ కొనసాగించాలని వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎండి రవి డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్