తిరుపతి: క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించుటకు బాధ్యతతో పని చేయాలి

56చూసినవారు
తిరుపతి జిల్లాలో క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించుటకు వైద్య అధికారులు, సిబ్బంది కలసి కట్టుగా బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ డా. వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం సాయంత్రం స్విమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో స్విమ్స్ డైరెక్టర్ డా. రవి కుమార్, ప్రిన్సిపాల్ డా. చంద్రశేఖర్, డీఎంహెచ్ఓ డా. శ్రీహరిలతో కలసి ఈ నెల 14 నుండి జిల్లాలో ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి వివిధ రకాల క్యాన్సర్ పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్