తిరుపతి: కార్యకర్తలకు న్యాయ బలాన్ని అందించండి

66చూసినవారు
బలహీనంగా ఉన్న వైసీపీ కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులను కోరారు. వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన నియమితులైన సందర్భంగా ఆదివారం తిరుపతి వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీకి న్యాయవాదులు అందించే శ్రమ భవిష్యత్తులో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వృథా కానివ్వరని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్